Fri Apr 03 2026 13:28:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ :జనవరి 1 కాదు.. డిసెంబర్ 31నే....

జనవరి 1వ తేదీ కాదు... ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీనే రాజకీయ అరంగేట్రంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఈరోజు చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో సమావేశమైన రజనీ తాను రాజకీయ ప్రవేశంపై ఈ నెల 31 వతేదీనే ప్రకటిస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ ఊగిపోయారు. ఈరోజు కంచీపురం, తిరువళ్లూరు, కృష్ణగిరి,ధర్మపురి, నీలగిరి ఫ్యాన్స్ తో రజనీ భేటీ అయ్యారు. మరోసారి అభిమానులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను హీరో అవ్వాలని సినిమాల్లోకి రాలేదన్నారు. హీరోగా తన తొలి సంపాదన యాభై వేలన్న రజనీ... అభిమానులు ప్రతి అంశాన్ని పాజిటివ్ గా ఆలోచించాలన్నారు.
- Tags
- రజనీకాంత్
Next Story

