బ్రేకింగ్ : జగన్ షాకింగ్ డెసిషన్

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక బరి నుంచి వైసీపీ తప్పుకుంది. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో అవినీతిని ప్రోత్సహించడం ఇష్టంలేకనే జగన్ ఎన్నికల బరిలో నిలవడానికి ఇష్టపడలేదు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడం, మరోసారి ఓటమిని చూడాల్సి రావడం ఇష్టం లేకనే పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆఖరి నిమిషంలో ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేతలు కర్నూలులో సమావేశమై అభ్యర్థి ఎంపికపై చర్చించారు. కాని చివరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. టీడీపీ మరోసారి డబ్బులు వెదజల్లి నేతలను కొనుగోలు చేసి... ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం ఇష్టంలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు వైసీపీ నేతలు చెబుతున్నారు.
- Tags
- జగన్

