బ్రేకింగ్ : జగన్ కు నా మద్దతన్న పవన్....!

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు తాను రెడీ అని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ అధినేత జగన్ సవాల్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. అయితే వైసీపీ ముందు అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నారు. మార్చి 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని వైసీపీని కోరారు. తాను 4వ తేదీన ఢిల్లీ వచ్చి సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీలతో మాట్లాడి అవిశ్వాసానికి మద్దతు సమకూరుస్తానని చెప్పారు. కాంగ్రెస్ తో కూడా తానే మాట్లాడి అవిశ్వాసానికి మద్దతు సంపాదిస్తానని చెప్పారు. జగన్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఒక్కరైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చన్నారు. తెలుగుదేశం భాగస్వామినని తనను అంటున్నారని, తానే మద్దతును కేంద్రానికి వ్యతిరేకంగా కూడగడతానని చెప్పారు. పార్టీలకు అతీతంగా జనసేనతో పాటు అఖిలపక్షం మద్దతు వైసీపీకి ఉంటుందన్నారు. జనసేన, తెలుగుదేశం మిత్రపక్షం కాదన్నారు. అది పాత విషయమని చెప్పారు. అవసరమైతే అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు కర్ణాటక, తమిళనాడు కూడా వెళతానన్నారు. వైసీపీ, టీడీపీలను చూస్తుంటే కేంద్రప్రభుత్వానికి భయపడుతున్నారనిపిస్తోందన్నారు. ప్రధాని మాట్లాడుతున్నప్పుడు వైసీపీ సభ్యులు ఎందుకు వాకౌట్ చేశారని ప్రశ్నించారు. సమిష్టిగా పోరాటం చేసి అనుకున్నది సాధించుకుందామన్నారు. తనకు క్రెడిట్ అవసరంలేదని ప్రజాప్రయోజనాలే ముఖ్యమని పవన్ చెప్పారు. ఆ క్రెడిట్ ను వైసీపీయే తీసుకోవచ్చన్నారు. వైసీపీ అవిశ్వాసం పెడితే తాను అండగా ఉంటానని చెప్పారు. రాహుల్, అఖిలేష్ లతో తాను మాట్లాడతానన్నారు. వైసీపీకి దమ్ముంటే ముందుగా అవిశ్వాసం పెట్టాలన్నారు. బలమైన నాయకుడు జగన్ అని ఆయనకు అండగా ఉంటామని పవన్ సెటైర్ వేశారు.
- Tags
- జగన్ పవన్

