Thu Mar 26 2026 21:45:16 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : జంపింగ్ వైసీపీ మంత్రులకు హైకోర్టు నోటీసులు

పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వైసీపీ గుర్తు మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి 22 మంది ఎమ్మెల్యేలు చేరారు. అందులో నలుగురు మంత్రులుగా కూడా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని ఆయన కోరారు. ఈరోజు హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. విచారించిన హైకోర్టు 22 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
- Tags
- వైసీపీ
Next Story

