బ్రేకింగ్ : చంద్రబాబుకు మోడీ ఫోన్

ప్రధాని మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫో్న్ చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే రాజీనామాలకు దారితీసిన పరిణామాలను చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న భావోద్వేగాలను మోడీకి వివరించినట్లు సమాచారం. అయితే ప్రధాని మోడీ చంద్రబాబుకు ఏమైనా హామీ ఇచ్చారా? లేదా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. రాజీనామాలు చేస్తున్న సమయంలో మోడీ చంద్రబాబుకు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వయంగా ప్రధాని మోడీ ఫోన్ చేయడంతో తిరిగి పరిస్థితులు మారనున్నాయా? అన్న చర్చలు అమరావతిలో జరుగుతున్నాయి. అయితే నిన్న రాత్రి చంద్రబాబు తాము మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్లుతెలయజేయాలని ప్రధాని కోసం ఫోన్లో ప్రయత్నించారు. కాని ఆయన అందుబాటులోకి రాని కారణంగా చెప్పలేకపోయారు. ఇదిలా ఉండగా కాసేపట్లో ప్రధానిని కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు కలవనున్నారు. కేంద్రమంత్రులుగా తమ రాజీనామాలను ప్రధానిమోడీకే సమర్పించనున్నారు.చంద్రబాబు సూచన మేరకు మోడీ అపాయింట్ మెంట్ కోసం ఇద్దరు కేంద్రమంత్రులు వేచి చూస్తున్నారు.
