Thu Apr 02 2026 12:08:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ వర్సెస్ టి.కాంగ్రెస్

గవర్నర్ నరసింహన్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సీరియస్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, కామారెడ్డి జిల్లాలో వీఆర్వో మృతి చెందారని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు చెప్పబోయారు. అయితే గవర్నర్ టి.కాంగ్రెస్ నేతల వాదనతో ఏకీభవించలేదు. చనిపోయింది వీఆర్వో కాదని తన వద్ద సమాచారం ఉందని, తప్పుడు సమాచారం ఇవ్వవద్దని గవర్నర్ చెప్పడంతో టి.కాంగ్రెస్ నేతలు ఖిన్నులయ్యారు. ఈ సందర్భంగా రాజ్యంగ పదవిలో ఉన్న తమరు ఇలా వ్యవహరించడం సరికాదని కూడా గవర్నర్ ను ఉద్దేశించి అన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? అని ప్రశ్నించినట్లు తెలిసింది.
- Tags
- గవర్నర్ నరసింహన్
Next Story

