Sat Mar 28 2026 20:18:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కమల్ కొత్త పార్టీ పేరు ఇదే....!

విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజకీయపార్టీని ప్రకటించారు. మధురై లో జరిగిన బహిరంగసభలో ఆయన పార్టీ జెండాను, అజెండాను ప్రజల ముందుంచారు. మక్కల్ నీది మయ్యమ్ అని పార్టీ పేరుగా కమల్ ప్రకటించారు. మక్కల్ నీది మయ్యమ్ అంటే జస్టిస్ ఫర్ పీపుల్ అని అర్ధం. ఈ సభకు ముఖ్యఅతిధిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. తాను నాయకుడిని కానని, మీలో ఒకడినని కమల్ చెప్పారు. ఈ సందర్భంగా కమల్ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తాను జనంలో నుంచి వచ్చానని నాయకుడిని కాదని కమల్ తెలిపారు. ఈ సభకు వేలాది మంది కమల్ అభిమానులు హాజరయ్యారు.
Next Story

