Thu Mar 26 2026 10:21:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎల్లుండి కోల్ కత్తాకు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై సీరియస్ గా దృష్టిపెట్టారు. ఎల్లుండి కేసీఆర్ కోల్ కత్తా వెళ్లనున్నారు. ఆయన కోల్ కత్తాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలవనున్నారు. ఈసందర్భంగా థర్డ్ ఫ్రంట్ గురించి చర్చించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో వివిధ జాతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. త్వరలోనే జార్ఘంఢ్ ముక్తి మోర్చా నేతలను కూడా కలిసే అవకాశముందని సీఎం కార్యాలయం వెల్లడించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ మమత బెనర్జీ తోపాటు మరికొందరు నేతలను కూడా ఆ యా రాష్ట్రాలకు వెళ్లి కలవనున్నారు.
- Tags
- కేసీఆర్
Next Story

