Sat Apr 04 2026 22:48:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సస్పెన్షన్?

నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి కి సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి గతకొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేసీఆర్ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. భూపతిరెడ్డికి కేసీఆర్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. అయినా భూపతిరెడ్డి తీరు మార్చుకో్కపోవడంతో కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఆయన సూచనల మేరకే భూపతిరెడ్డిని సస్పెన్షన్ సిఫార్సును ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు సిఫార్సు చేశారు. ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ సస్పెండ్ చేసే అవకాశముంది.
Next Story

