Sun Mar 29 2026 08:56:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్యే చింతమనేనికి మూడేళ్ల జైలు శిక్ష...!

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ను కొట్టినకేసులో భీమడోలు మెజిస్ట్రేట్ ఈ తీర్పు చెప్పారు. 2011 జన్మభూమి కార్యక్రమంలో ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడిచేసినట్లు కేసు నమోదయింది. వట్టి వసంతకుమార్ గన్ మెన్ ను కొట్టిన కేసులోకూడా శిక్ష పడింది. మొత్తం మూడు కేసుల్లో మూడేళ్ల జైలు శిక్ష పడింది. విచారణ జరిపిన పోలీసులు కేసును న్యాయస్థానం ముందుంచారు. దీంతో ఈ మూడు కేసుల్లో చింతమనేనికి మూడేళ్ల జైలు శిక్షపడింది. ఆ తర్వాత చింతమనేనికి బెయిల్ మంజూరయింది.
Next Story

