Wed Mar 25 2026 03:09:01 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎంపీ రాజీనామా

అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు ముత్తుకరుప్పన్ తన పదవికి రాజీనామా చేశారు. కావేరీ జల వివాదానికి పరిష్కారం చూపకపోవడం వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి సమర్పించారు. మరోవైపు కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. తమిళనాడు ప్రజల బాధలు తమకు తెలుసునని, త్వరలోనే దీనికి పరిష్కారంచూపుతామని తెలిపారు. ఏప్రిల్ 19న కావేరీపై విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
Next Story

