Thu Mar 26 2026 02:25:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఉభయసభల్లో సేమ్ సీన్ రిపీట్

లోక్ సభ బుధవారం ప్రారంభమయిన వెంటనే సభ వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్లపైన, అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. దీంతో సభలోకి వచ్చిన కొద్దిసేపటికే స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడు పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు విన్పించుకోలేదు. దీంతో వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు.
- Tags
- లోక్ సభ
Next Story

