Thu Mar 26 2026 07:18:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అవిశ్వాసం చర్చకు లేకుండానే రేపటికి వాయిదా

విపక్షాల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభలో ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. సభ ఆర్డర్ లో లేకుండా తాను సభను కొనసాగించలేనని చెప్పారు. సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని పదే పదే విజ్జప్తి చేశారు. అయితే విపక్షాలు నినాదాలతో హోరెత్తించడంతో సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కేంద్రప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభను సుమిత్రా మహాజన్ రేపటికి వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించకుండానే సభ రేపటికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమేనంటూ హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. అయినా టీఆర్ఎస్, మరికొన్ని పార్టీలు ఆందోళన విరమించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.
- Tags
- లోక్ సభ
Next Story

