Sat Mar 28 2026 03:22:51 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అడవుల్లో భారీ ఎన్ కౌంటర్... 12 మంది మావోల మృతి?

ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు ముఖ్యనేత హరిభూషణ్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్ ఘడ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. మావోయిస్టు మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ తీవ్రంగా గాయపడటంతో ఆయనను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తడపాల వద్ద ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
- Tags
- ఎన్ కౌంటర్
Next Story

