Fri Apr 10 2026 08:23:38 GMT+0530 (India Standard Time)
బోటు ప్రమాదానికి కారకులపై వేటు

కృష్ణానదిలో నాలుగురోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గాఉంది. చర్యలకు దిగింది. ప్రయివేటు బోట్ ఆపరేటర్లతో కుమ్మక్కయిన ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ప్రాధమిక విచారణలో వెలుగు చూసిన ఆధారాల మేరకు ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ శాఖ జనరల్ మేనేజర్ రామకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ కొల్లి శ్రీధర్, బీవీఎస్ గంగరాజు, పి. వీరారెడ్డి, బోటు డ్రైవర్ నరసింహారావు, చెంచెంరాజు, శ్రీనివాసరావులను విధుల నుంచి తొలగించింది. కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో గత ఆదివారం 22 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
- Tags
- బోటు ప్రమాదం
Next Story

