బిట్ కాయిన్..!. నల్లధనం అక్కడకు చేరిందే...!

ప్రపంచ ఆర్దిక వ్యవస్దను గడ గడలాడిస్తున్న బిట్ కాయిన్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆదాయపు పన్నును ఎగ్గొట్టేందుకు బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టి వుంటారని నిఘా వర్గాలు అనూమానిస్తున్నాయి.. బిట్ కాయిన్ పెట్టు బడులు పెట్టి ట్యాక్స్ కు ఎగనామం పెట్టిన వారిపైన ఐటి దృష్టి పెట్టింది.. దేశవ్యాప్తంగా బిట్ కాయిన్ ఎక్సైంజ్ లపైన ఐటి దాడులు చేసింది.
భారీగా పెట్టుబడులు....
ప్రపంచ ఆర్దిక వ్యవస్దను గడ గడలాడిస్తున్న బిట్ కాయిన్ ఇప్పడు ఇండియా ఆర్థిక వ్యవస్ద మీద ప్రభావం చూపే అవకాశం వుంది. ఇండియాలో ఇప్పటికే గల్లీ గల్లీలోవున్న వారు ఇందులో పెట్టు బడులు పెట్టారు. పది వేలు వున్నప్పడు ఈ బిట్ కాయిన్ అంటే ఎమిటోతెలుసుకుని పెట్టు బడులుపెట్టారు మన దగ్గర వున్న అక్రమార్కులు. ఈ బిట్ కాయిన్ ను ఇండియన్ ఆర్దిక వ్యవస్ద అంగీకరించలేదు. సరిగదా.. అసలు ఈ కాయిన్స్ లో పెట్టు బడులు పెట్ట వద్దని చెప్పింది ..అయినప్పటికి ఇండియాలో బిసిటిఎస్స్ అనే సంస్ద ఒక కంపెనీని తెరిచింది.. బిట్ కాయిన్ లావాదేవిలు నిర్వహించింది... పది వేలు వునప్పడు బిట్ కాయిన్ లో పెట్టు బడులకు ఆహ్వానించింది. ఇప్పడు బిట్ కాయిన్ విలువ పదమూడు లక్షల పైచిలుకు వుంది. ఒక్కసారి గా పద మూడు లక్షల వరకు బిట్ కాయిన్ విలువ పెరిగిపొవడంతో దీనిపైన పెద్ద ఎత్తున్న పెట్టు బడులు పెడుతున్నారు ఇండియన్ యూత్.
అనేక మంది వ్యాపారవేత్తలు....
దీనికి తోడు వ్యాపార వేత్తలు కూడా దీనిలో పెట్టు బడులు పెడుతున్నారు. మరొక వైపు ఇందులో లాభాలు బాగా వుంటున్నాయని చెప్పి చాలా మంది యూత్ కూడా ఇందులో పెట్టుబడులుపెట్టారు. ఈ బిట్ కాయిన్ వ్యాపారం పైన ఒక్కసారిగా ఆర్బీఐ దృష్టి పెట్టింది. బిట్ కాయిన్ వ్యాపారం చేస్తున్న వారి వివరాలు ఇవ్వాలని అడిగింది. కేవలం పేపర్స్ కే పరిమితమైన ఈ బిట్ కాయిన్ లను నమ్మవద్దని చెప్పింది. ఇందులో పెద్ద మొత్తంలో నల్లధనం పెట్టు బడులు పెట్టినట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఎన్ఆర్ఐ లు ఇందులో పెట్టు బడులు పెట్టే అవకాశం వుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఐటీశాఖ దాడులు....
ఇక పొతే ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ తో ఐటి శాఖ అప్రమత్తం అయ్యింది. వెంటనే ఇండియా లో బిట్ కాయిన్ ఎక్సైంజ్ లను నిర్వహిస్తున్న బిసిటిఎక్స్ సంస్ద కార్యాలయంపైన ఐటి దాడులుచేసింది. హైదరాబాద్ తో పాటుగా ఢిల్లి. ముంబాయ్. బెంగుళూరు. చైన్నయ్, ఘజీయాబాద్ లోని కార్యాలయాల్లో సొదాలు చేశారు. హైరరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఎస్ క్యాపిటర్ ఎక్సెంజ్ పైనా ఐటి దాడులు చేసి వివరాలను సేకరించింది. ఈ కంపెనీ ద్వారా ఇప్పటి వరకు 24 వేల మంది బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు. వీరంతా ఇండియా మొత్తం మీద వున్నారు. అయితే ఇందులో ఎన్ఆర్ఐ లు, వ్యాపార వేత్తలు ఎవరు వున్నారొ తెలియదని నిర్వహాకుడు అంటున్నారు. బిట్ కాయిన్ ఎక్సేంజ్ నిర్వహిస్తున్న ఈ కంపెనీ పైన ఐటి ఇరవై నాలుగు గంటల పాటుగా సోదాలు చేసి అన్ని వివరాలను సేకరించారు. ఏది ఏమైనా బిట్ కాయిన్ పైన ఇప్పడు చర్చ జరుగుతుంది. ఎస్ క్యాపిటర్ ద్వారా పెట్టు బడులు పెట్టిన వారి వివరాలు ఐటి వద్దకు చేరాయి.
- Tags
- బిట్ కాయిన్

