బిజెపి పై "మెర్సీ" చూపని మెర్సల్

ఇప్పుడు దక్షిణాదిన విజయ్ నటించిన చిత్రం మెర్సెల్ సంచలనం సృష్టిస్తుంది . దీనికి కారణం ఈ సినిమా అత్యంత వివాదాస్పద పంచ్ డైలాగ్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భీభత్సమైన సెటైర్స్ తో వెండి తెర మీదకు దూసుకు రావడం సినిమా టైటిల్ దగ్గర నుంచి విడుదలైన తరువాత కూడా తీవ్ర చర్చకు దేశవ్యాప్తంగా తెరలేపింది మెర్సిల్. ఈ చిత్ర దర్శకుడు అట్లీ నిర్మాత మురళి ఇప్పటికి వివాదాలతో చస్తుంటే విజయ్ మాత్రం హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు. చిత్రం తాజా వివాదాలకు కారణం బిజెపి అమలు చేసిన నోట్ల రద్దు, జీఎస్టీపై భారీ డైలాగ్స్ తో పాటు వైద్య రంగంలో మెడికల్ చెకప్ అంతా స్కామ్ గా చిత్రీకరించడంతో ఈ సోమవారం చెన్నై హై కోర్టు ని కొందరు మెడికోలు ఆశ్రయిస్తున్నారు.
తమిళ బీజేపీలో ప్రకంపనలు రాజీనామాలు ...
ఈ సినిమా తమిళనాట బిజెపి నేతల రాజీనామాకు కూడా దారితీసింది. సినిమా తాను చూశానని అందులో అభ్యంతరాలు ఏమి లేవంటూ బిజెపి తమిళనాడు మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ జమీల వ్యాఖ్యానించారు. తమ పార్టీలో హిందుత్వ భావజాలం పెచ్చు మీరిపోయిందని దానికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు జమీల ప్రకటించారు. ఆమెతో బాటు ఆమె భర్త కూడా కమలానికి గుడ్ బై కొట్టేశారు. మరోవైపు ఈ చిత్రం పై బిజెపి నేత షాట్ గన్ శత్రుత్వ సిన్హా తనదైన శైలిలో స్పందించారు. సెన్సార్ అయ్యి ఒక చిత్రం బయటకు వచ్చిందంటే తిరిగి ఆ సినిమాను అడ్డుకోవడం భావప్రకటనా స్వేచ్చకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై , జీఎస్టీపై దేశంలోని ప్రజల్లో అనుకూల ప్రతికూల అభిప్రాయాలు ఉంటాయి అంత మాత్రాన చిత్రాన్ని నిషేధించడం సంభాషణలు తొలగించడం సరికాదన్నారు. విమర్శలను స్పోర్టివ్ గా స్వీకరించాలన్నారు.
తమిళ చిత్ర సీమ అండగా ...
నటుడు దర్శకుడు , నిర్మాత కమల్ హాసన్ మెర్సెల్ చిత్రాన్ని పూర్తిగా సమర్ధించారు. ఇక తమిళ అసోసియేషన్ కూడా చిత్రానికి అండగా నిలిచింది . అసోసియేషన్ నాయకుడు విశాల్ కూడా చిత్ర యూనిట్ కి మద్దత్తు ప్రకటించారు . రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఈ చిత్రంపై ప్రశంశల వర్షం కురుస్తుంది . రాహుల్ గాంధీ మొదలు , చిదంబరం , తిరునావరక్కసు వరకు అంతా సినిమా సూపర్ అంటూ బిజెపి వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు సినిమా తీస్తే తప్పేంటి అంటున్నారు.
వివాదం రేపిన డైలాగ్స్ ఇవే ...
ఇక చిత్రంలో బిజెపి కి అభ్యంతరకరమైన డైలాగ్ జీఎస్టీ అమలు చేస్తున్న సింగపూర్ లో 7 శాతం వసూలు చేస్తూ వైద్యం ఉచితం గా అందిస్తుంటే 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న ఇండియా లో ఎందుకు వైద్యం ఉచితంగా అందడం లేదని హీరో ప్రశ్నలు వేస్తాడు . అలాగే నోట్ల రద్దు , జీఎస్టీపై అనేక సెటైర్లు , పంచ్ డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా బిజెపి నేతలకు మాత్రం కాలెలా చేసింది. కేంద్ర కార్యక్రమాలపై అవగాహన లేకుండా సినిమా ఎలా తీశారంటూ కమలనాధులు మండిపడుతున్నారు. టైటిల్ నుంచి విడుదల వరకు అన్ని వివాదాలను భరించిన నిర్మాత మురళి ఇక చిత్రం విడుదల అయిన తరువాత కూడా ఈ గొడవలు భరించలేక చేతులు ఎత్తేశాడు . వివాదాస్పద సన్నివేశాలు తొలగిస్తామని, అలాగే బిజెపి కి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టొద్దంటూ విజయ్ అభిమానులను వేడుకున్నాడు. మరి నిర్మాత తాజా నిర్ణయంతో బిజెపి శాంతిస్తుందో లేదో చూడాలి.
- Tags
- బీజేపీ

