బిజెపి తో వద్దు మొర్రో అంటున్నా

మనకు వద్దు ఈ పొత్తు. ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో చిత్తు అయిపోతాం... బాబోయ్ అంటూ టిడిపి లోని మెజారిటీ ఎమ్యెల్యేలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. రాష్ట్రానికి ఇక ఇచ్చేది ఏమి లేదని కేంద్ర ఆర్ధిక సంఘం తేల్చినా చంద్రబాబు పొత్తు వదులు కోవడానికి ముందు వెనుక ఆడుకుతున్న నేపథ్యంలో పార్టీ వర్గాల తో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ్ముళ్ళు పొత్తు వదులుకోవాలని కుండబద్దలు కొట్టేశారు. అందరి ఆలోచనలు స్వీకరించిన చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. పార్టీ శ్రేణులతో ఆయన ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తూనే వస్తున్నారు.
వద్దన్నా ముద్దే అంటున్న బాబు ...
ఈ దశలో కేంద్రం నుంచి విడిపోవాలా లేదా అన్న పాయింట్ పై మూడు రకాల ప్రశ్నలు తమ్ముళ్లకు బాబు అందించారు. పొత్తు వదులుకోవడం, కొనసాగడం, మరికొంత కాలం వేచి చూడటం. వీటిలో అంతా పొత్తు వదులుకోమనే మెజారిటీ తమ్ముళ్లు మొగ్గు చూపారు. అయినా కానీ మరికొంత కాలం పాటు వేచి చూడాలనే బాబు భావిస్తున్నారు. ఏపీకి అరకొరగా దక్కే నిధులు దక్కకుండా పోతాయన్న ఆందోళన ఆయన వ్యక్తం చేస్తున్నట్లు పలువురు ఎమ్యెల్యేలు అంటున్నారు. పోరాడుతూనే సాధించాలిసినవి సాధిస్తామని బాబు అందరిని కన్విన్స్ చేస్తున్నారు.
- Tags
- బీజేపీ టీడీపీ
