బాబు ఇటు రాగానే గడ్కరీ ఏంచేశారంటే ...?

పాత కాంట్రాక్టర్ కి నెల గడువు ఇచ్చాం. ఆయన నెల్లో పని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేస్తాడో లేదో చూస్తాం. కాకపోతే మారుస్తాం అన్న కేంద్రం నిధుల విడుదలపై ఏపీ సర్కార్ కి స్పష్టమైన హామీలు ఇచ్చింది. ఇప్పుడో 800 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నారు. మిగిలినవి నెలరోజుల్లో సర్దేస్తారని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి గడ్కరీ ముందే ప్రకటించి ఇలా అమరావతి వచ్చారో లేదో ఆయన ఇచ్చి వచ్చిన ఫైల్ అంతే వేగంగా తిరిగొచ్చింది. మా సందేహాలు ముందు తీర్చండి. ఆ తరువాత నిధుల సంగతి చూస్తామంటూ కేంద్ర జలమండలి ఆదేశించింది. దీనిని బట్టి పోలవరం నిధులు ఇప్పటివరకు చేసిన వాటికి ఇప్పట్లో కేంద్రం విడుదల చేసే అవకాశాలు లేవని నిపుణులు భావిస్తున్నారు.
కొత్త తలపోట్లు అధిగమిస్తుందా ...?
ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువలకు ఎంత ఖర్చు ఇంకా అవుతుంది ? భారీగా నిర్మాణ వ్యయం ఏడాదిలో ఏ ప్రాతిపదికన పెంచారు. కాలువలకు ఖర్చు పెట్టింది ఎక్కడ ఎలా ఎంత ఎప్పుడు ఎందుకు ఇవ్వలిసి వచ్చింది ? పవర్ ప్రాజెక్ట్ సంగతేమిటి దానికెంత అవుతుంది ? ఇలా లక్షా తొంభై ప్రశ్నలకు రాష్ట్రం జావాబు సక్రమంగా చెప్పి ఇప్పుడు వేగవంతంగా తిరిగి కేంద్రానికి పంపవలిసి వుంది. సాంకేతిక అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంతృప్తి కరంగా జవాబులు వెళ్ళిన తరువాతే నిధులను ఏ మేరకు విడుదల చేస్తారో ఆలోచిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ. ఈలోగా జనంలో ప్రాజెక్ట్ కడతారా లేదా అన్న సందేహాలు లేవకుండా కేంద్ర మంత్రి గడ్కరీ ఇప్పటివరకు ఏపీ సీఎం చేసిన పనే చేయనున్నారు. ఆయన ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పోలవరం పై రివ్యూ చేస్తూ ప్రాజెక్ట్ పై వీలైనంత ప్రచారం సాగిస్తారని ఇరిగేషన్ నిపుణులు కొందరు వ్యాఖ్యానిస్తూ ఉండటం విశేషం.
- Tags
- పోలవరం

