Thu Mar 26 2026 20:31:19 GMT+0530 (India Standard Time)
బాబుపై కేటీఆర్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. చంద్రబాబు నిన్న తెలంగాణ సెంటిమెంట్ ను చూసి రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు ప్రత్యేకహోదా కూడా ఏపీ ప్రజల సెంటిమెంటేనని అది ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అయితే దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో పోరాడి మరీ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని, ప్యాకేజీలు తమకు ఇస్తామని మభ్యపెట్టినా తాము తలవంచకుండా రాష్ట్రం కోసమే పోరాడామన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ ప్రజలను కించపర్చే విధంగా మాట్లాడవద్దని, ఏపీ హక్కుల కోసం పోరాడాలని చంద్రబాబును కేటీఆర్ కోరారు.
- Tags
- కేటీఆర్
Next Story

