Wed Mar 25 2026 21:49:38 GMT+0530 (India Standard Time)
బాబుకు విజయసాయి వార్నింగ్

చంద్రబాబుపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ పెడతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. తనను నేరగాడుగా అభివర్ణిస్తూ, పీఎంవోపైన కూడా విమర్శలు చేయడాన్ని విజయసాయి రెడ్డి తప్పుపట్టారు.ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎంవో నేరగాళ్లకు అడ్డంగా మారిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను తాను సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. తాను ఒక ఎంపీగా ప్రధానిని కలవడంలో తప్పేమీ లేదన్నారు. ఖచ్చితంగా ప్రజాసమస్యలపై తాను ప్రధానిని కలుస్తానని, అదే సమయంలో చంద్రబాబు అవినీతి గురించి కూడా తెలియజేస్తానని ఆయన చెప్పారు. పదే పదే తనను నేరగాడిగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తాను ఒక రాజ్యసభ సభ్యుడినని ఆయన గుర్తు చేశారు.
Next Story

