Thu Mar 26 2026 02:25:48 GMT+0530 (India Standard Time)
బాబుకు విజయసాయి ఘాటు కౌంటర్

చంద్రబాబును దోషిగా నిలబెట్టేంత వరకూ తాను ప్రధాని మోడీని, మంత్రులను కలుస్తూనే ఉంటానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రాష్ట్రానికి ఇచ్చిన లక్షా ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఏం చేశారో చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు అవినీతపై చర్యలు తీసుకునేంత వరకూ తాను వారిని కలుస్తూనే ఉంటానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా పోలవరాన్ని రాష్ట్రానికి అప్పగించలేదని, చంద్రబాబు కోరితేనే అప్పగించినట్లు రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం మంత్రుల నుంచి వచ్చిందన్నారు. విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన ఈ కౌంటర్ ఇచ్చారు.
- Tags
- విజయసాయిరెడ్డి
Next Story

