Wed Mar 25 2026 08:02:00 GMT+0530 (India Standard Time)
బాబుకు టాలివుడ్ అండ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు టాలివుడ్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసిన సినీ ప్రముఖులు ప్రత్యేక హోదా ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అఖిలపక్షం పిలుపు మేరకు తాము కూడా నల్లబ్యాడ్జీలతో ఏప్రిల్ 6వ తేదీ వరకూ నిరసనలు తెలుపుతామని చెప్పారు. హోదా ఉద్యమానికి ఏపీ సర్కార్ వెంటే టాలివుడ్ ఉంటుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిని కలసిన వారిలో సీనీ దర్శకులు రాఘవేంద్రరావు, కేఎస్ రామారావు, అశ్వనిదత్, కేఎల్ నారాయణ తదితరులు ఉన్నారు.
Next Story

