బాబుకు చుట్టుకున్న ఐలయ్య వివాదం

వివాదాస్పద పుస్తక రచయిత కంచె ఐలయ్య ఇప్పుడు తన టార్గెట్ ను ఏపీ సీఎం చంద్రబాబు మీద పెట్టారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ల పుస్తకం విడుదలైన నాటినుంచి టిడిపి ఎంపీ ప్రముఖ పారిశ్రామిక వేత్త వైశ్యుల ప్రతినిధి టిజి వెంకటేష్ వివిధ సందర్భాల్లో తనపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మళ్ళీ ఐలయ్య మీడియా కు ఎక్కారు. టిజి వెంకటేష్ ఐలయ్య నడుమ మరోసారి మాటల యుద్ధం నడిచింది. ఆయనను చంపడం టైం వెస్ట్ అని దేశంలో ఎవరికి అంత ఖాళీ లేదంటూ టీజె చేసిన తాజా వ్యాఖ్యలకు ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. మరి టైం వెస్ట్ చేయకుండా ఎందరిని టీజె చంపించారన్నారు. ఇలా ఇద్దరు మాటల తూటాలు పేలుస్తున్నారు.
అమరావతికి ఈనెల 28 న ఐలయ్య ...
ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు ఈ నెల 28 న విజయవాడలో దళిత సంఘాలు సత్కారం ఏర్పాటు చేయడం మరో కొత్త వివాదానికి తెర తీసేలా వుంది . ఆయన విజయవాడ వస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయంటూ ఆర్యవైశ్యులు బ్రాహ్మణ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి . అయితే తాను విజయవాడ వచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడేది లేదని ఐలయ్య స్పష్టం చేశారు . దాంతో మరో సమస్య దిశగా వ్యవహారం నడుస్తుంది . ఇది కూడా ఒకరంగా చంద్రబాబు సర్కారుకి శాంతి భద్రతల సమస్య తెచ్చిపెట్టేదే . మొత్తానికి ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఐలయ్య , టీజె వివాదం అమరావతి కేంద్రానికి చేరడం బాబు సర్కార్ కి తలనొప్పి వంటిదే.
- Tags
- కంచెఐలయ్య

