Mon Feb 02 2026 10:44:39 GMT+0000 (Coordinated Universal Time)
బయలుదేరిన జగన్....!

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే రేపు శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో జగన్ రాజమండ్రి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రేపు కోర్టు ముగిసిన తర్వాత తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంటారు. శనివారం పాదయాత్ర యధాతధంగా ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈరోజు సాయంత్రం లోటస్ పాండ్ లో జగన్ ముఖ్యనేతలతో సమావేశమయ్యే అవకాశముంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన సీనియర్ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Next Story
