Fri Mar 27 2026 12:06:57 GMT+0530 (India Standard Time)
బంధంపై హరిబాబు ఏమన్నారంటే?

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి చేయనంత సాయం ఏపీకి కేంద్రం చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మిత్రబంధానికి ఎలాంటి అపాయం లేదన్నారు. బీజేపీ వైపు నుంచి అటువంటి ఆలోచన కూడా లేదని హరిబాబు స్పష్టం చేశారు. పదేళ్ల కాలంలో విభజన చట్టంలో పొందుపర్చిన హామీలను అమలు చేయాలని ఉన్నప్పటికీ తాము మూడున్నరేళ్లలోనే ఎక్కువ హామీలను నెరవేర్చామని చెప్పారు. రాజకీయాలకు తావులేకుండా రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.
- Tags
- హరిబాబు
Next Story

