పవన్ కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం!

అవును! ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు ఒకింత దుమారమే రేపుతున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న పవన్ ఇలా వ్యాఖ్యానించడం ఏంటనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. పవన్‌కు ఇటు చంద్రబాబుతోను, అటు మోడీతోను మాట్లా డే ధైర్యం లేదా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్‌లో రెండు రోజులు జరిగిన జేఎఫ్సీ సమావేశం ముగిసింది. ఏపీ విభజన చట్టం హామీల అమలుపై ఏపీలోని రాజకీయ పక్షాలు వేడివేడిగా స్పందిస్తు న్నాయి. ఈ క్రమంలోనే అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీలు పార్లమెంట్లులో రగడ సృష్టించాయి. కేంద్రంలో మంత్రులుగా ఉన్న అశోక్‌గజపతి రాజు, సుజనా చౌదరిలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా సుజనా ఆది నుంచి కూడా ఏపీ విషయంలో స్పందిస్తూ వచ్చాడు.
రెండు పార్టీలూ పోరాడుతుంటే....
టీడీపీ ఎంపీలు తీవ్ర నిసరన వ్యక్తం చేయడం కూడా ఢిల్లీని కదిలించింది. ఇక, వైసీపీ ఎంపీలు.. కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇలా అధికార, విపక్షాలు రెండూ కూడా ఏపీ విభజన చట్టంలోని హామీల విషయంలో పోరాటం ఉధృతం చేశాయి. దీనికి తోడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సైతం ఏపీలో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇలా ప్రతి పార్టీ ఏదో ఒక రూపంలో ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా తన దైన శైలిలో జేఎఫ్సీ అంటూ జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులతో జట్టుకట్టి హైదరాబాద్‌లో చర్చ పెట్టాడు. అంత వరకు ఓకే. అయితే, ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పాలని కోరడం ఇప్పుడు కలకలం సృష్టింది. అయితే. భేషజాలకు పోకుండా.. చంద్రబాబు ప్రభుత్వం ఓ నివేదికను సైతం పవన్‌కు పంపించింది. ఇక, ఈ సమయంలోనే కన్‌స్ట్రక్టివ్‌గా వ్యవహరించాల్సిన పవన్.. అలా చేయలేదు.
అవిశ్వాసం పెడితే....
చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ కలిసి కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని పిలుపు నిచ్చాడు. ఇప్పటి వరకు ఎందుకు ఆ ఆలోచన చేయలేదని కూడా ప్రశ్నించాడు. నిజానికి కేంద్రంతో ఉంటేనే ఏపీకి ఇప్పటివరకు ఒనగూరిన లబ్ధి లేదు. మరి ఇక, కేంద్రంతో తెంచుకుంటే ఏమొస్తుందన్నది ఎప్పటి నుంచో చంద్రబాబు వాదన. మరోవైపు జగన్ తమ ఎంపీల రాజీనామాలకు ముహూర్తం పెట్టేశారు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ ఇలా పిలుపునివ్వడం అంటే ఎందుకు? అనే ప్రశ్న వస్తోంది. ఇక, ఈ రెండు పార్టీలూ పోరాడితే.. పవన్ తనవంతు సలహాలిచ్చి కూర్చుంటాడా? అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఏపీ కోసం పోరాడాలన్నది ఏపీ ప్రజల ఆకాంక్ష. మరి ఆ దిశను వదిలేస్తున్న పవన్‌పై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.
- Tags
- పవన్ కల్యాణ్

