Thu Apr 02 2026 01:50:45 GMT+0530 (India Standard Time)
ప్రేమించలేదని....నరికేశాడు....!

కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. జానకి అనే యువతిని ప్రేమోన్మాది దారుణంగా హత్య చేశాడు. మూసాపేట్ హబీబ్ నగర్ లో యువతి నివాసం ఉంటున్న గదిలోకి వచ్చిన కొందరు కత్తులతో పొడిచి చంపేశారు. ఆనంద్ అనే యువకుడు గత కొద్దిరోజులుగా తననను ప్రేమించాలని జానికిపై వత్తిడి తెస్తున్నాడు. అయితే జానకి అందుకు అంగీకరించలేదు. ప్రేమించకపోతే హత్య చేస్తానని కూడా ఆనంద్ బెదిరించాడు. అయినా వినకపోవడంతో ఆనంద్ హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆనంద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
- Tags
- ప్రమోన్మాది హత్య
Next Story

