ప్రమాదంపై చంద్రబాబు సీరియస్

బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు శాసనసభలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా లేకపోవడంతో తనంతట తానుగానే ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరికాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం పై ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్న అపవాదు నుంచి బయట పడటానికి ప్రభుత్వం నేరుగా ప్రకటన చేయనుంది. ప్రమాదానికి గల కారణాలను తెలిపనుంది. అంతేకాకుండా ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందో ప్రజలకు వివరించనుంది.
శాసనసభలో ప్రకటన......
అంతేకాకుండా ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం తరుపున ఏమేం చర్యలు తీసుకుందీ వివరిస్తారు. కొందరు అధికారులపై చర్య తీసుకునే అవకాశముందంటున్నారు. బోటు యజమానిపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోనుందో వివరించనున్నారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు మంత్రులు ఏమేం చేసిందీ వివరిస్తారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారంపై కూడా చర్చిస్తారు. శాసనసభ మృతుల కుటుంబానికి సంతాపం ప్రకటించనుంది. ప్రకటనను మాత్రం హోంమంత్రి చినరాజప్ప చేసే అవకాశముందని, అయితే చివరి నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాచు చేయవచ్చని తెలుస్తోంది.

