ప్రతి అడుగులో ప్రేమ కన్పిస్తుందన్న జగన్...!

ప్రజాసంకల్ప యాత్రలో ప్రతి అడుగులోనూ ఆప్యాయత, అభిమానాలు కన్పిస్తున్నాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. నిన్న నెల్లూరు జిల్లా సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ ఈ ట్వీట్ చేశారు. ప్రజల నుంచి తనకు అనూహ్యరీతిలో మద్దతు లభిస్తుందన్నారు. తాను వేస్తున్న ప్రతి అడుగులోనూ ప్రజల ప్రేమ, ఆదరణ లభిస్తున్నాయని చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజలకున్న గౌరవం, ప్రేమ ఏపాటిదితో ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వంపై ఆగ్రహం.....
ఈ ప్రభుత్వంపై ప్రజలకున్న ఆగ్రహం, ప్రభుత్వం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు కూడా ఈ పాదయాత్రలో తెలుసుకునే వీలు చిక్కిందన్నారు. ప్రజల ఆశీస్సులే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర సాగించాలన్న తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని జగన్ ట్వీట్ చేశారు. ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. 74 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన జగన్ అక్కడ పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఏపీ అంతటా వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. మొత్తం మీద జగన్ పాదయాత్ర వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
- Tags
- జగన్

