Sun Dec 28 2025 11:10:19 GMT+0000 (Coordinated Universal Time)
ప్రగతి దీక్ష – విజయ కాంక్ష :: తెలుగుపోస్ట్ శుభాకాంక్షలు

కోటికోర్కెల ఊసులన్నీ
భవిత దిశగా ఉరకలెత్తగ
దశమి వేడుక వచ్చెనండీ
గుండె గుండెలో స్ఫూర్తి నింపగ!
అణువణువునా మెండుగా ధైర్యం
అడుగడుగునా వెరవని సాహసం
కరుణించు మాకు మాకు తల్లీ
సాగగా బతుకు ప్రస్థానం!!
అలుపెరగని శ్రమవేదం
కావాలి మా జీవన నాదం
ప్రసాదించు అమ్మ దుర్గా
అర్హమైన బంగరు భవితవ్యం!!
పాఠకులు, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
- సంపాదకులు, తెలుగుపోస్ట్ డాట్ కామ్
Next Story

