పోలీసంటే ఇలా ఉంటారా..!

తెలంగాణలో ఇప్పడు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. పై స్థాయి అధికారుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతూ అటు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా వుండాలని పోలీస్ బాస్ ప్రతినిత్యం చెబుతుంటారు.అంతేగాకుండా అందుకు కావాల్సిన వనరులను కూడా సమర్చుతున్నారు. పెద్ద మొత్తంలో నిధులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి దశలో పోలీస్ డిపార్ట్ మెంట్ పరువు ప్రతిష్టలు మంట గలిపే విధంగా కింది స్థాయి అధికారులు వ్యవహరిస్తున్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చిన వారితో సఖ్యతగా వ్యవహరించాలని కూడా చెబుతున్నారు ఉన్నతాధికారులు..అయితే వీటన్నింటిని కాదని పాత తరం పోలీసింగ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు కిందిస్థాయి పోలీసులు.. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు ఇప్పడు వివాదాస్పదంగా మారుతుంది. హైదరబాద్ లో జరిగిన రెండు సంఘటనల్లో ఇద్దరు పోలీసు అధికారులపైన వేటు పడింది.
బూటు కాలుతోతన్నుతూ....
మాదాపూర్ అడిషినల్ డీసీపీ సైబరాబాద్ షీ టీమ్ ఇంచార్జీ గా పనిచేస్తున్న గంగిరెడ్డి వ్యవహారం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఒక ఆర్ట్ డైరెక్టర్, హీరోయిన్ ల మధ్య నెలకొన్న వివాదం చివరకు గంగరెడ్డి పైన వేటుకు దారి తీసింది. హీరోయిన్ హారిక కు డైరెక్టర్ యోగి కుమార్ ల మధ్య వివాదం వుంది. ఇద్దరు ఛాటింగ్ చేసుకున్నారు. యోగి కుమార్ అసభ్య కరంగా మెసేజ్ లు చేయడంతో హీరోయిన్ వెంటనే షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. విచారణ లో భాగంగా పోలీసులు అతన్ని స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ తరుణంలో యోగి కుమార్ కౌన్సెలింగ్ లో కూడా అదనపు డిసిపి గంగిరెడ్డితో అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో పాటుగా హీరోయిన్ తో అసభ్యకరంగా మాట్లాడడంతో కోపం తట్టుకొలేక గంగిరెడ్డి వెంటనే తన సీట్ నుంచి లేచి యోగి కుమార్ ను వారించాడు. అదే సమయంలోయోగి రేమార్ అదనపు డిసిపిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. గంగిరెడ్డి వెంటనే తన బూట్ కాలుతో యోగి కుమార్ ను తన్నాడు. ఇలా కొడుతున్న సమయంలో హీరోయిన్ హారిక తన సెల్ ఫోన్ నుంచి వీడియో తీసింది. ఈ వీడియోను తరువాత తన మిత్రులకు పంపింది.. అదికాస్తా యోగికుమార్ వద్దకు చేరడంతో అతను ఆవీడియోను సొషల్ మీడియాలో పోస్టు చేశాడు.. ఈ వీడియో పైన ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి విచారణ ఆరంభించారు. చివరకు గంగిరెడ్డి చేసింది తప్పుని తెలడంతో వెంటనే బదలీ చేస్తూ సిపి సందిప్ శాండిల్య ఆదేశాలు జారీ చేశారు.
మహిళముందే దర్జాగా....
ఇక పోతే రాచకొండ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ సేష్టన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం ఒక హత్య జరిగింది. ఈ హత్యకు సంబంధించి బాధితుల ఫిర్యాదు ను అక్కడ వున్న ఇన్ స్పెక్టర్ ఉమా మాహేశ్వర్ రావు తీసుకోవాడానికి వెళ్లాడు. జవహార్ నగర్ లో వుంటున్న బాధితురాలు అయిన బారతి ఇంటికి వెళ్లాడు. ఇన్ స్పెక్టర్.. ఇంటికి వెళ్లిన ఇన్ స్పెక్టర్ అక్కడ వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది. బాధితురాలు మంచం పక్కనే కూర్చుని ఫిర్యాదు రాస్తున్నారు. ఈ తరుణంలో ఇన్ స్పెక్టర్ రెండు ప్లాస్టిక్ కూర్చిలను వేసుకుని మంచం మీద దర్జాగా కాలు వేసి కూర్చున్నాడు. పక్కనే మహిళ వుందన్న ధ్యాస లేకుండా దర్జాగా మంచం మీద కాలు పెట్టుకుని ఫిర్యాదు రాయించుకున్నాడు. ఈ ఫోటో కాస్తా బయటికి వచ్చింది. రాచకొండ సిపి వెంటనే విచారణ చేసి సదరు ఇన్ స్పెక్టర్ ను వెంటనే డిఐజి హైదరబాద్ రేంజ్ కు రిపొర్టు చేయమని ఆదేశించాడు..
గతంలో కూడా....
ఇదిలా వుంటే గతంలో కూడా ఈ ఉమామహేశ్వర్ రావు ప్రవర్తన ఇలాగే వుండేది .. ట్రాఫిక్ తో పాటుగా అబిడ్స్ లా అండ్ ఆర్డర్ పిఎస్ లో పనిచేస్తున్న తరుణంలో అక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో రెండు సార్లు అతని పైన చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీస్ అంటుంటే.. కింది స్దాయి సిబ్బంది చేస్తున్న ఇలాంటి పనుల వల్ల మొత్తం పోలీస్ శాఖ పరువు పొతుందని అధికారులు అంటున్నారు.

