పోలవరం పై తప్పును కేంద్రం పై నెట్టేశారే...!

చంద్రబాబు ఏం చేసినా పక్కాగా ప్లానింగ్ తో చేస్తారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరి నిధుల కొరత అన్నది అసెంబ్లీ లో తన ప్రసంగంలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎత్తి చూపి బిజెపి కి భవిష్యత్తులో రాం రాం చెప్పడానికి రంగం సిద్ధం చేసేసారు. పెరిగిన ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని 58 వేలకోట్ల రూపాయలు గా తేల్చిన బాబు ఇప్పటివరకు 12 వేలకోట్ల 567 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. గతంలో 129 కోట్ల రూపాయలకు తొలిగా ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఉండేదని ఇప్పుడు ఇంత అయ్యిందన్నారు చంద్రబాబు .లక్ష్యం లోగా పోలవరం పూర్తి చేస్తామని తన జీవిత ఆశయం ప్రాజెక్ట్ పూర్తి చేయడమేనన్నారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం గమనించినా నాలుగోవంతు ఖర్చు పెట్టి మిగిలిన మూడొంతుల పని కి 45వేల500 ల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి మరి అంత సొమ్ము కేంద్రం ఇస్తుందా ? అన్న ప్రశ్నకు సమాధానం చంద్రబాబు చెప్పకపోవడం గమనార్హం.
బాబు చెప్పిన లెక్కలు ఇవి ...
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలిసింది 74131 కోట్లరూపాయలు అయితే కేంద్రం ఇప్పటిదాకా ఇచ్చింది 3102 కోట్లు కాగా రావలిసింది గా తేల్చారు. స్పిల్ వే డయాఫ్రామ్ కి 6660 కోట్ల నుంచి 11637 కోట్ల రూపాయలకు అంచనా పెరిగిందన్నారు. పవర్ ప్రాజెక్ట్ కి 2500 కోట్ల రూపాయలకు 4205 కోట్ల రూపాయలకు అంచనా వ్యయం చేరిందన్నారు. పునరావాస నిమిత్తం 2934 కోట్ల రూపాయల నుంచి 33 855 వేలకోట్ల రూపాయలకు అంచనా భారీగా పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇక కుడి కాలువ కోసం 2135 కోట్ల నుంచి 3256 కోట్లకు అంచనా పెరగగా, ఎడమ కాలువ 1471 కోట్ల నుంచి 4960 కోట్లకు పెరిగిపోయిందన్నారు . ఇప్పటివరకు రేడియల్ గేట్ల పని 100 శాతం పూర్తి అయ్యిందని. 72 శాతం మట్టిపని పూర్తి చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 7 ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసి సహకరించిందని నిధుల అంశంలో ఇంకా చేయాలిసింది చాలానే ఉందన్నారు. తాజాగా మరో 300 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెబుతున్నారని ఇంకా నిధులు తమ చెంతకు రాలేదన్నారు.
పోలవరం కోసం అహరహం...
పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఏపీని సస్య శ్యామలం చేయాలని లక్యంగా పెట్టుకున్నా అని అందుకోసం 20 సార్లు ప్రాజెక్ట్ ప్రాంతానికి వెళ్లానని తెలిపారు. 46 సార్లు వర్చ్యుల్ గా తనిఖీ చేశానన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆపడానికి జరగని కుట్ర లేదని కొందరు కోర్టులకు వెళ్ళి అడ్డుకోవాలని చూసినా తన సంకల్పంతో అన్ని అడ్డంకులు దాటుకుని శరవేగంగా లక్ష్యానికి అనుగుణంగా పనులు చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు.
కేంద్ర కమిటీ సంతృప్తి ...
ప్రాజెక్ట్ పునరావాస పరిశీలనకు వచ్చిన కేంద్ర కమిటీ సభ్యులు లీలా నాయర్, లతా కృష్ణా రావు సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్ట్ లో నిర్వాసితులకు ప్రభుత్వం కట్టిస్తున్న పక్కా గృహాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పిస్తామని వారు వెల్లడించినట్లు సిఎంఓ వర్గాలు తెలిపాయి.
- Tags
- పోలవరం చంద్రబాబు

