Mon Apr 06 2026 10:48:52 GMT+0530 (India Standard Time)
పోలవరంపై గడ్కరీ కిరి..కిరి

పోలవరం పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టేశారు. పెరిగిన అంచనా వ్యయం కేంద్ర ప్రభుత్వం భరించదని తేల్చి చెప్పారు. అలాగే పునరావాస కార్యక్రమానికి కేంద్రానికి సంబంధం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలు కేవీపీ, రఘువీరారెడ్డి, పళ్లంరాజు తదితరులు కేంద్రమంత్రి గడ్కరీని కలిసి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగానే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పోలవరాన్ని 2019 లోగా పూర్తి చేస్తామని చెప్పారు. కాగా పోలవరం కోసం 381 కోట్ల నిధులను విడుదలచేస్తూ ఫైలుపై గడ్కరీ సంతకం చేశారు. ఈ సందర్భంగా తాము గతంలో ఖర్చు చేసిన 2800 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని దక్షిణ కొరియా నుంచి చంద్రబాబు ఫోన్ లో కోరగా, ఆ విషయాన్ని తర్వాత చర్చిద్దామని దాటవేశారు.
- Tags
- పోలవరం
Next Story

