Sun Apr 05 2026 23:35:13 GMT+0530 (India Standard Time)
పీకల్లోతు కష్టాల్లో భారత్...!

శ్రీలంకతో జరగుతున్న వన్డే లో భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక ఆది లోనే మూడు వికెట్లు తీసింది. 11 ఓవర్లలో మూడు కీలక వికెట్లను భారత్ కోల్పోయింది. మాథ్యూస్ బౌలింగ్ లో థవన్ అవుటయ్యారు. శిఖర్ థావన్ ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ నుంచి వెనుదిరిగారు. రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ కూడా పెవిలియన్ నుంచి వెనుదిరిగారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేలకు కెప్టెన్ కోహ్లీ దూరంగా ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భారత్ 12 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.
- Tags
- క్రికెట్
Next Story

