Thu Mar 26 2026 04:09:59 GMT+0530 (India Standard Time)
పార్టీ శ్రేణులకు జగన్ తాజా పిలుపు ఇదే

ప్రత్యేక హోదా సాధన కోసం ఏ ఉద్యమానికైనా తాము మద్దతు తెలుపుతామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఎటువంటి ఆందోళనను చేయడానికైనా వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నెల 22వ తేదీన ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి జాతీయ రహదారుల దిగ్భంధనానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుకు జగన్ స్పందించారు. వైసీపీ కూడా జాతీయ రహదారుల దిగ్బంధనంలో పాల్గొంటుందని చెప్పారు. పార్టీ శ్రేణులందరూ 22న జాతీయ రహదారుల దిగ్భంధనంలో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు.
- Tags
- జగన్
Next Story

