Sun Mar 29 2026 22:49:13 GMT+0530 (India Standard Time)
పాత పాటే పాడిన జైట్లీ

రాజధాని నిర్మాణానికి ఇప్పటికే నిధులిచ్చామని, విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటికే అమలు చేశామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. లోక్ సభలో ఏపీ ఎంపీల నిరనసను శాంతింప చేయడానికి ఏపీ విభజన అంశాలను జైట్లీ ప్రస్తావించారు. ఏపీలో ఏర్పాటు చేసిన సంస్థలకు ఇప్పటికే నిధులు ఇచ్చామని, ఇంకా ఇస్తూనే ఉన్నామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కూడా నిధులు ఇచ్చామన్నారు. నాబార్డు ద్వారా పోలవరానికి నిధులు ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే నష్టం జరిగిందని తమకు తెలుసన్నారు. అరుణ్ జైట్లీ ప్రసంగిస్తుండగా రాఫెల్ ఒప్పందం ఎంత మేరకు జరిగిందో చెప్పాలని విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. సభ రేపటికి వాయిదా పడింది.
- Tags
- అరుణ్ జైట్లీ
Next Story

