పవన్ వ్యూహాలపై వైసిపి దృష్టి పెట్టిందా?

గత ఎన్నికల్లో వైసిపి కి అధికారం దూరం కావడానికి జనసేన పార్టీ టిడిపి కి మద్దత్తు ఇవ్వడమే అని వైసిపి నేతలు ఇప్పటికి ఇంటా బయట చెప్పుకునే మాట . కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దగ్గరగా వచ్చి బోర్లా పడ్డామని ఆ పార్టీ నేతల బాధ . అందుకే గత పాఠాలు నుంచి తప్పులు దిద్దుకునే క్రమంలో జనసేన వేస్తున్న ప్రతి అడుగు విశ్లేషిస్తూ కౌంటర్ గేమ్ తో వైసిపి సాగిపోతుంది . అందుకే అవకాశం లభించినప్పుడు పవన్ పై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా వైసిపి నేతలు విమర్శల వర్షం కురిపిస్తూ వుంటారు . తెలంగాణ లో కేసీఆర్ అండ్ టిఆర్ ఎస్ పార్టీ తొలి నుంచి పవన్ ను తీసిపారేస్తున్నట్లు మాటలు తూటాలు వదులుతుంది . అదే ధోరణి వైసిపి ఇక్కడ కనబరుస్తుండటం విశేషం .
నంద్యాల , కాకినాడ లో ఎందుకు పోటీ చేయలేదు ..?
పవన్ తన బలం తనకు తెలియదని పార్టీ నిర్మాణం పూర్తిగా చేపట్టాకా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకున్నాకే ఎక్కడ ఎలా పోటీ చేయాలన్న నిర్ణయానికి వస్తా అంటూ చేసిన వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్స్ లో విభిన్న వాదనలు వినవస్తున్నాయి . పికె వ్యాఖ్యల్లో సత్యం ఉంటే ఆయన జనసేన తరపున నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రయోగాలు చేసి ఫలితాలు తెలుసుకునే అవకాశాన్ని ఎందుకు జారవిడిచారని కొందరు ప్రశ్నిస్తున్నారు. జనసేన పేరిట పవన్ టిడిపి కి లబ్ది చేకూర్చడానికి తెలంగాణ , ఏపీ లో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు ఆంద్ర లో వైసిపి , తెలంగాణ లో టిఆర్ ఎస్ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
- Tags
- పవన్ వైసీపీ
