Mon Apr 06 2026 08:08:44 GMT+0530 (India Standard Time)
పవన్ పై జగన్ షాకింగ్ కామెంట్స్

చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ సీన్ లోకి వస్తారని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. కాని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చంద్రబాబుకు ఎప్పుడు అవసరమో అప్పుడే పవన్ ప్రజల్లోకి రావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుందన్నారు. చంద్రబాబును పవన్ విమర్శించరన్న జగన్, బాబు ప్రభావం నుంచి పవన్ బయటపడితే బాగుంటుందన్నారు. చంద్రబాబు చేసే మోసం, అవినీతి గురించి పవన్ తెలుసుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాపై తనదీ, పవన్ దీ ఒకేమాట, ఒకే బాట అని ముక్తాయించారు.
Next Story

