పవన్ పై ‘కత్తి’ లాంటి సెటైర్

సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి పవన్ పై ఫైరయ్యాడు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీని కూడా వదిలిపెట్టలేదు.
‘‘మోడీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడయ్యాడా? ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోడీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతుందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కల్యాణ్’’అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ‘‘స్పెషల్ స్టేటస్ అంటే జోకయిపో్యింది. వైజాగ్ రమ్మని పిలుపునిచ్చావ్. నువ్వు మాత్రం రాలేదు. మీ దోస్త్ చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీకి, స్టేటస్ కు తేడా లేదంటారు. నువ్వు మళ్లీ స్టేటస్ కావాలంటే పోరాడాలి అంటావు. మేము రెడీ అంటే ముందు నేను పోరాడతానంటావు. అసలు ఒక్క విషయం మీదైనా క్లారిటీ ఉందా? ఆ క్లారిటీ లేదనే విషయం కూడా క్లియర్ గా అర్థమవుతోందా? ’’ అని మహేశ్ కత్తి ట్వీట్ చేయడంతో పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
- Tags
- పవన్ కత్తి మహేష్

