Tue Mar 31 2026 05:41:10 GMT+0530 (India Standard Time)
పవన్ ను నేనే దగ్గరుండి తీసుకెళ్తానన్న రేవంత్...!

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. పవన్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ను పవన్ పొగిడేయటమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసమే కేసీఆర్ పవన్ ను రంగంలోకి దించారన్నారు. పవన్ లాంటి పాత్రలు ముందు...ముందు చాలా వస్తాయన్నారు. వీహెచ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ చేసిన డిమాండ్ పై కూడా రేవంత్ స్పందించారు. తాను పవన్ ను రాహుల్ వద్దకు తీసుకెళతానని, ఆయనకే ఈ విషయాన్ని చెప్పవచ్చని ఛలోక్తి విసిరారు.
Next Story

