Mon Apr 06 2026 04:06:10 GMT+0530 (India Standard Time)
పవన్ చెప్పిన ‘గుండు’ స్టోరీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత విషయాన్ని ఒకటి గుర్తుకు తెచ్చారు. తనకు పరిటాల రవి గుండు చేయించారన్న వార్త నిజం కాదని ఆయన చెప్పారు. తాను సినిమాల్లో విసిగి గుండు చేయించుకుంటే పరిటాల రవి తనకు గుండు చేయించారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగిందన్నారు. కాని దానిపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోలేదన్నారు. కాని సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నానని, తనపై దుష్ప్రచారం చేసినా తనకు ఎవరిమీద కోపం లేదని, ఆ విషయాన్ని ప్రచారం చేసిన వారి గురించి ఆలోచించనూ లేదన్నారు. అమరావతిలో కులాల గొడవ లేకపోతేనే అభివృద్ధి చెందుతున్నారు. వంగవీటి రంగాను హత్య చేయడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు, కులాలు అభివృద్ధి చెందితేనే ఏపీ ముందుకు వెళుతుందన్నారు. తాను ఇకసినిమాల జోలికి వెళ్లబోనని, పూర్తి స్థాయి రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు.
- Tags
- పవన్
Next Story

