Sun Apr 05 2026 18:22:41 GMT+0530 (India Standard Time)
పవన్ గుండుపై పరిటాల స్పందన ఇదే....!

పవన్ గుండు పై ఏపీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. ఓ ఇంటి వివాదంలో పవన్ కు పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో ప్రచారం జరిగింది. అది ప్రచారమేనని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, అప్పుడు తనకు పరిటాల రవి ఎవరో కూడా తెలియదని పవన్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి పరిటాల సునీత స్పందించారు. తన భర్త పరిటాల రవి అలాంటి పనులు చేయలేదన్నారు. పవన్ కల్యాణ్ చెప్పింది వాస్తవమేనన్నారు. పరిటాలపైకొందరు అప్పట్లో అనవసర ప్రచారానికి దిగారన్నారు. భర్తకు పవన్ కల్యాణ్ కు సంబంధమే లేదన్నారు. పవన్ కు పరిటాలకు అసలు గొడవ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కళ్లముందు అభివృద్ధి కనపడుతుంటే వైసీపీ నేతలకు కనపడటం లేదా? అని పరిటాల సునీతమ్మ ప్రశ్నించారు.
Next Story

