పవన్ కు బీజేపీ ప్యాకేజీ ఎంత?
విజయవాడలో దుర్గగుడి పార్కింగ్ వద్ద వసూలు చేసిన డబ్బులు ఒక ఎమ్మెల్యేకు వెళుతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పుడు పవన్ వ్యాఖ్యలకు స్పందించారు. తాను పార్కింగ్ డబ్బులు తీసుకుంటున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు. పవన్ ఎవరు చెబితే ఇలా మాట్లాడుతున్నారో అర్థమయిందన్నారు. బీజేపీ నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్ కల్యాణ్ ఇలా టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయా? ఉంటే అవి వెంటనే బయటపెట్టాలని జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. హోదా కోసం ఉద్యమిస్తారనుకుంటే పవన్ కల్యాణ్ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ టీడీపీపై విరుచుకుపడటం పై జలీల్ మండిపడ్డారు. కేంద్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కల్యాణ్ టీడీపీని ఏం చేయలేరన్నారు. జనసేన లేనప్పుడే టీడీపీ స్థానిక సంస్జల ఎన్నికల్లో గెలిచిందని జలీల్ చెప్పారు.
- Tags
- జలీల్ ఖాన్