పవన్ కు అది చివరిదేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అజ్ఞాత వాసి అంటున్నారు కొందరు. వచ్చే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవడానికి సినీ రంగానికి పవన్ గుడ్ బై కొడతారన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న అజ్ఞాతవాసి మరో వారం రోజుల్లో పికె పార్ట్ వరకు షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. ఈ చిత్రం జనవరి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ఒక్క చిత్రానికే పవన్ డేట్స్ ఇచ్చారు. ఆ తరువాత ఆయన సినిమాలు చేస్తారో లేదో క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల వరకు జనంలోకి జనసేనను తీసుకువెళ్లడం లక్ష్యంగా పవన్ పెట్టుకోవడంతో అజ్ఞాతవాసి చిట్టచివరి సినిమా కాబోతుంది. ఎన్నికల వరకు క్షణం తీరికలేని పరిస్తతి పవన్ కి ఏర్పడుతుంది. దాంతో ఆయన కొత్త సినిమాలు చేసేందుకు సిద్ధంగా అయితే లేరు.
ఉల్టా పల్టా అయితే రీ ఎంట్రీ ఇస్తారా ...?
వచ్చే ఎన్నికల్లో రాణించకపోతే చిరంజీవి లాగా సినిమాల్లో కొనసాగాలని పవన్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు కొందరంటున్నారు. గతంలో ఒక ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి పవన్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేసే సమర్ధత ఉందని తమ్ముడిని ఆశీర్వదించారు. దాంతో సినిమాలు ఇప్పట్లో వదులుకునే నిర్ణయాన్ని పవన్ తీసుకోరనే అంటున్నారు అంతా. నవంబర్ చివరినాటికి అజ్ఞాత వాసి వారణాసిలో పూర్తి చేసుకున్న తరువాత పార్టీ కార్యాచరణపై పికె దృష్టిపెట్టనున్నందున ఆయన భవిష్యత్తులో సినీ రంగంలో వుంటారా మరో పాతికేళ్ళు రాజకీయాల్లో సేవ చేస్తా అని ప్రకటించినందున సినిమాలకు గుడ్ బై కొడతారో కాలమే తేల్చి చెప్పనుంది.
- Tags
- పవన్ కల్యాణ్

