‘పవన్ కు అర్థం కాదు.. జగన్ కు ఏమీ తెలియదు’

జనసేన అధినేతకు పవన్ కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రంఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై ఏళ్లుగా తాను రాజీకీయాల్లో ఉన్నానని, అటువంటిది తనకే ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన లేదన్నారు. మరి ఇప్పడు మాట్లాడే వారికి ఏం అవగాహన ఉందని ప్రశ్నించారు. కొందరు అంతా తమకే తెలుసనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, పోలవరం లెక్కలు అన్నీ సరిగానే ఉన్నాయని, పైసా కూడా అవినీతి జరగలేదని పరోక్షంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కు సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ కావాలనే అడ్డంపడుతుందన్నారు. వారం వారం తాను సమీక్ష చేస్తున్నానని, తన రాజకీయ జీవితంలో ఏ ప్రాజెక్టు మీద ఇంత శ్రద్ధపెట్టలేదన్నారు. అవసరమైతే సహకరించండి గాని అడ్డుపడవద్దని కోరారు. పోలవరానికి అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే ఎదురుతిరుగుతారని సీఎం హెచ్చరించారు.
- Tags
- చంద్రబాబు

