పవన్ కళ్యాణ్ ఎవరో ఆయనకూ తెలియదు ....!

నేను సినిమాలు చూడను . అందువల్ల పవన్ కళ్యాణ్ ఎవరో ఆయన కథేమిటో నాకు తెలియదంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు. అంతకుముందు కేసీఆర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా ఆ కోవలోకి వచ్చి చేరారు మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం. తనకు పవన్ కళ్యాణ్ అంటే తెలియదని, ఆయనను ఎప్పుడు నేరుగా కలుసుకోలేదన్నారు ముద్రగడ. అయితే పోస్టర్ లు చూడటం ద్వారా నటుడిగా తెలుసన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం పై మీడియా తో మాట్లాడుతూ ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జనసైనికుల ఆగ్రహం ....
తరచూ కొందరు నేతలు తమ ఆరాధ్యదైవం పై వెటకారంగా స్పందిస్తున్న తీరును జనసైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. కావాలనే పవన్ ను తక్కువ చేయాలని కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇలాంటి ప్రకటనలని వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా లో సైతం ముద్రగడ తాజా వ్యాఖ్యలపై చర్చలు సాగుతున్నాయి. పవన్ ను గతంలో చంద్రబాబు ఉచ్చులో పడొద్దంటూ ముద్రగడ హెచ్చరించిన సందర్భాన్ని ఈ నేపథ్యంలో కొందరు గుర్తు చేస్తున్నారు. ముద్రగడ మరి అప్పుడెందుకు పవన్ కి ఆ సందేశం ఇచ్చారని తెలియనప్పుడు ఎందుకు అనేక సార్లు జనసేనాని తలిచారన్నది వారి ప్రశ్న. ఇలా అనేకరకాల ప్రశ్నలు విమర్శలతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు ప్రతి విమర్శలు నడవడం గమనార్హం.

