పరిటాల ఇంట్లో పవన్....!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మంత్రి పరిటాల సునీతను కలిశారు. పరిటాల సునీత ఇంటికి వెళ్లి మరీ పవన్ కలిశారు. పవన్ కు పరిటాల శ్రీరామ ఘన స్వాగతం పలికారు. అనంతపురం సమస్యలపై పరిటాల సునీతతో పవన్ కల్యాణ్ చర్చించారు. పొత్తులపై ఎన్నికల ముందే మాట్లాడతానని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టపర్తిలో పర్యటించనున్నారు. అనంతపురం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా కదిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని మధ్యాహ్నం పుట్టపర్తిలోని హనుమాన్ జంక్షన్ లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. తర్వాత సత్యసాయి మందిరాన్ని సందర్శించుకోనున్నారు. ఈరోజు రాత్రికి పుట్టపర్తిలోనే పవన్ బస చేయనున్నారు. గతంలో పరిటాల రవి తనకు గుండు కొట్టించారన్న వార్తలను పవన్ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ స్వయంగా పరిటాల ఇంటికి వెళ్లి సునీతతో చర్చించడం గమనార్హం.

