పద్మావత్ సినిమా కు కర్ణిసేన గ్రీన్ సిగ్నల్ ...!

సంజయ్ లీలా బన్సాలీకి కష్టాలు తీరిపోయాయి. ఆయన నిర్మించిన పద్మావత్ చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కర్ణిసేన. ఈ చిత్రం నిషేధించాలని కోరుతూ పద్మావత్ నిర్మాణం ప్రారంభం అయిన నాటినుంచి తీవ్ర స్థాయిలో కర్ణిసేన ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమాల్లో శృతిమించిన కిష్కింధ కాండే నడిపింది. సినిమా విడుదల వివాదం అనేక మలుపులు తిరిగింది. సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళిన సమస్య పై అత్యున్నత న్యాయస్థానం పద్మవాత్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ సినిమా విడుదల అడ్డుకునే వారిపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సుప్రీం. కానీ సుప్రీం ఆదేశాలను సైతం భేఖాతర్ చేస్తూ కర్ణిసేన మరోసారి విధ్వంసాలకు దిగింది. నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాల్లో సైతం నిషేధం విధించారు.
ఎట్టకేలకు చిత్రం చూసి ....
సినిమా చూసి కర్ణిసేన నిర్ణయం తీసుకోవాలని చిత్రాన్ని నిర్మించిన సంజయ్ బన్సాలి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఆ వినతులను కర్ణిసేన తోసిపుచ్చింది. ఈనెల 25 న చిత్రం విడుదలకు ప్రపంచవ్యాప్తంగా సన్నాహాలు ఒక వైపు సాగుతున్నాయి. మరోవైపు సర్వత్రా ఏమి జరగబోతుందన్న టెన్షన్ నడుస్తుంది. ఈనేపథ్యంలోనే సంజయ్ మరోసారి కర్ణిసేనకు సినిమా చూడాలన్న ఆహ్వానం ఉద్యమ నాయకులు అంగీకరించారు. సుమారు 50 మంది కర్ణిసేన నాయకులు, జర్నలిస్ట్ లు ఢిల్లీ లో ఒక ధియేటర్ లో సినిమా చూశారు. అనంతరం చిత్రం చాలా బాగుందని వారు హర్షం వ్యక్తం చేశారు. తాము అనుమానించిన విధంగా ఏ సీన్లు కానీ చరిత్ర వక్రీకరణ ఏమి లేవని తేల్చింది. దాంతో పద్మావత్ విడుదల వివాదం ఎట్టకేలకు ఒకరోజు ముందే సుఖాంతమైంది.
- Tags
- పద్మావత్

