Mon Apr 06 2026 20:50:51 GMT+0530 (India Standard Time)
నోరు జారద్దొన్న చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పై టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం పై ఏదో ఒకటి మాట్లాడి రాద్ధాంతం చేయవద్దని హెచ్చరించారు. సంయమనంతో, సహనంతో వ్యవహరించాలని టీడీపీ నేతలకు సూచించారు. తాను పోలవరం ప్రాజెక్టు విషయంలో మరోసారి ప్రధాని మోడీ, నితిన్ గడ్కరీతో తాను స్వయంగా కలిసి మాట్లాడతానని అప్పటి వరకూ నేతలు ఎవరూ ఈ విషయంలో నోరు జారవద్దని గట్టిగానే చెప్పారు. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు పై విధంగా స్పందించారు.
- Tags
- చంద్రబాబు
Next Story

